![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -350 లో.. భవాని అన్న మాటలని కృష్ణ గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. రోజు రోజుకి పెద్ద అత్తయ్యకి నాపై కోపం పెరిగిపోతుందని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే మురారి కృష్ణ దగ్గరకి వచ్చి.. నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుందని చెప్పుకుంటూ మురారి బాధపడతాడు. భోజనం చేద్దాం.. అయ్యో ప్లేట్స్ కడగాలి కదా అని కృష్ణ అనగానే.. నేను నీకు హెల్ప్ చేస్తానని మురారి అంటాడు. మీరు పుట్టకతోనే రిచ్, పైగా ఏసీపీ అయిన మీరు ఇలా నా కోసం చెయ్యడం గ్రేట్ అంటూ కృష్ణ అంటుంది.
కాసేపటికి కృష్ణ భోజనం తీసుకొని వస్తుంది. ఇక కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు. నువ్వు ఇంట్లో వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నీకు నేను ఉన్నానని మురారి చెప్పగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం ముకుంద కాఫీ తీసుకొని వచ్చి పడుకున్న మురారిని నిద్రలేపుతుంది. అలా ముకుంద వచ్చి తనకి కాఫీ ఇవ్వడం మురారి చిరాకుగా ఫీల్ అవుతాడు. ఇంకా మూడు రోజుల్లో నీకు కాబోయే భార్యని అని ముకుంద అంటుంది. లేదు నేను నేరస్తులని పట్టుకుంటానని మురారి అంటాడు. కృష్ణ వాళ్లే చేస్తే ఏమి పట్టుకుంటావని ముకుంద అంటుంది. నువ్వు నా ఫ్రెండ్ భార్యవి.. నా ఫ్రెండ్ కి నేను అన్యాయం చెయ్యలేనని మురారి కోపంగా చెప్పి కృష్ణ దగ్గరకి వెళ్లిపోతాడు. మరొకవైపు కృష్ణ తులసి పూజ చేస్తుంటుంది. మురారి కోపంగా రావడం చూసిన కృష్ణ.. ఏమైందని అడుగుతుంది. అ ముకుంద చిరాకు తెప్పిస్తుందని మురారి చెప్తాడు. కాఫీ పెడతాను లోపలికి పదండి అంటూ కృష్ణ మురారిని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారికి కాఫీ ఇస్తుంది. మిగతా కాఫీ ప్లాస్క్ లో పోసి రేవతి అత్తయ్య తీసుకొని రమ్మందని మురారికి కృష్ణ చెప్తుంది.
మరోకవైపు భవానిని రెచ్చగొట్టేలా ముకుంద మాట్లాడుతుంది. రాను రాను మురారికి మీరంటే అసలు వాల్యూ లేకుండాపోతుంది. కృష్ణ మాటనే వింటున్నాడు. నేను కాఫీ తీసుకొని వెళ్తే తాగకుండా కృష్ణ దగ్గరకు వెళ్ళాడని ముకుంద చెప్తుంది. కాసేపటికి రేవతిని భవాని పిలిచి.. కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. కృష్ణ తీసుకొని వస్తుందని రేవతి అనగానే.. భవాని కోప్పడతుంది. ఫోన్ చేసి వద్దని చెప్పమని మధుకి చెప్తుంది. మధు వెటకారంగా మాట్లాడేసరికి మధు చెంపపై ఒక్కటిస్తుంది భవాని. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు కాఫీ తీసుకొని ఇంట్లోకి వస్తారు. తరువాయి భాగంలో కృష్ణ కాలు బెనికితే మురారి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వస్తాడు. అలా ఎత్తుకొని రావడం ముకుంద, భవానీలు చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |